మియాపూర్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ సుభాష్‌చంద్రబోస్ నగర్లో షేక్ బీబీ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కార్పొరేటర్ వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అందించే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని గాంధీ పేర్కొన్నారు. ముస్లీం మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్దుల్ కరీం, కాశీనాథ్,మున్నా , రాజ్యలక్ష్మీ, మౌలానా, నాగార్జున , రవి తదితరులు పాల్గొన్నారు.