సిటీబ్యూరో: 1994లో గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 74లో జర్నలిస్టులకు కేటాయించిన 64 ఎకరాల భూములను కబ్జాదారుల నుంచి రక్షించాలని జర్నలిస్టులు వేడుకుంటున్నారు. సర్వే నెంబర్ 74/పార్ట్‌గా ఫైనల్ లే అవుట్లో 549 మందికి ప్లాట్లను కేటాయించి, రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులను కల్పించింది. ఈ సర్వే నెంబర్లోని భూములన్నీ కూడా గడిచిన 30 ఏళ్లుగా జర్నలిస్టుల ఆధీనంలోనే ఉన్నాయి. అడ్డదారిలో భూముల ఆక్రమణకు తెరలేపారు.
దీనిపై 41 మంది జర్నలిస్టుల భూములను ఆక్రమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్న కబ్జాదారులు.. ఏకంగా ఆ జర్నలిస్టులకు లీగల్ నోటీసులతోపాటు, జర్నలిస్టులే ఆ భూములను కబ్జా చేశారంటూ కోర్టుకెక్కి క్లియర్ టైటిల్ భూములను వివాదంలోకి పడేశారు. గోపన్‌పల్లిలోని జర్నలిస్టు లే అవుట్లో ఉన్న భూములకు రక్షణ కల్పించేలా సర్కారు చర్యలు తీసుకోవాలని, కబ్జాకోరల నుంచి విడిపించాలని, పక్క సర్వే నెంబర్లతో జరుగుతున్న ఆక్రమణలకు తెర దించేలా, సొసైటీ భూములకు రక్షణ కల్పించాలని సభ్యులు కోరుతున్నారు.