కందుకూరు, అక్టోబర్ 15 : బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని జడ్సీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి కోరారు. ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. సరస్వతిగూడ, లేమూరు, అగర్మియగూడ, తిమ్మాపూరు, బైకరికంచె, బైరాగిగూడ, తదితర గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, వట్నాల ఈశ్వర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గంగాపురం గోపాల్‌రెడ్డి, పరంజ్యోతి రాము ముదిరాజ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, రామకృష్ణ, భిక్షపతి, సురేందర్‌రెడ్డి, మేఘనాథ్‌రెడ్డి, ఢిల్లీ శ్రీధర్, రేవంత్‌రెడి, మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ రాములు, యాదయ్య, శ్రీనివాస్, స్వామి, సుధాకర్, యాదగిరి, సత్యనారాయణరెడ్డి, నర్సింహ, రామకృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
మంత్రి గెలుపే లక్ష్యంగా పని చేయాలి
మహేశ్వరం, అక్టోబర్ 15: మంత్రి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికునివలే పని చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్ తెలిపారు. ఆదివారం మహేశ్వరం మండల కేంద్రంలోని కాకి సత్యనారాయణ ఫంక్షన్హాల్లో మహేశ్వరం గ్రామ శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం ప్రజలే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బలం, బలగం అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడో
సారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని.. భారీ మెజార్టీతో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించి మరోసారి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, గ్రామ శాఖ అధ్యక్షుడు దుడ్డు కృష్ణయాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్లు పొల్కం బాలయ్య, కడమోని ప్రభాకర్, నాయకులు మీనాజ్పటేల్, మునగపాటి నవీన్, ఎంఏ సమీర్, ఎస్కే ఆజాం, మనోహర్, బాల్‌రాజ్, సంజీవ, శ్రీశైలం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.