Kalyanamahotsavam | కన్నుల పండుగగా శివపార్వతుల కల్యాణం
మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతిరెడ్డి, డైరక్టర్ ఆనంతరెడ్డిల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం వేడుకలు మంగళవారం నిర్వహించారు.
శంషాబాద్ రూరల్ : మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతిరెడ్డి, డైరక్టర్ ఆనంతరెడ్డిల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణమహోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. కల్యాణమహోత్సవానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, జడ్పీటీసీ నీరటి తన్విరాజులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నగోల్కొండ గ్రామంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించడంతో పాటు నూతనంగా శివాలయం పరిధిలో కోనేరు నిర్మాణం చేయడం అద్బుతంగా ఉందన్నారు. గ్రామాలలోని ప్రజలు భక్తిభావాన్ని పెంచుకొని ఆలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నీలంమోహన్, మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి,ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు గౌతమ్బాబు,సారలక్ష్మీ, పలువురు పార్టీనాయకులు, కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

