హైదరాబాద్ : పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పురాతన కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు.
మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంత్రి వెంట MAUD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు.