హైదరాబాద్ : నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ప్రభ్యత్వం వదిలిపెట్టదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఇటీవల బేగంబజార్‌లో దారుణ హత్యకు గురైన నీరజ్ పవార్ భార్య సంజన, తల్లి నిషా పవార్ మంత్రిని కలిశారు.
నీరజ్ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని మంత్రిని కోరారు. నీరజ్ హత్యకు కారకులైన వారు ఎవరైనా ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షిస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను ఉపేక్షించబోదని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో ఫోన్లో మాట్లాడి నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి వెంట రాజస్థానీ సైనిక్ క్షత్రియ్ సంఘ్ అధ్యక్షుడు రాంపాల్ దౌడ, జగదీష్ ప్రసాద్ పవార్ఉన్నారు.