మన్సూరాబాద్, డిసెంబర్ 17: మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురికాలనీలో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కాలనీ గౌరవ అధ్యక్షుడు, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
చంద్రపురికాలనీలో అంతర్గత రోడ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి రుద్ర యాదగిరి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలలో రోడ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు పోచబోయిన జగదీష్‌యాదవ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, సీహెచ్. బాలరాజు గౌడ్, పారంద నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.