Muta Gopal | కవాడిగూడ, మే 23 : ఎల్బీనగర్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఎల్బీ నగర్లోని డబుల్బెడ్రూమ్ సముదాయాన్ని శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని, డబుల్బెడ్రూమ్ సముదాయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. తమకు ఇళ్లు రాలేదని ఎలాగైనా ఇళ్లు ఇప్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ఎల్బీ నగర్ డబుల్బెడ్రూమ్ సముదాయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని బస్తీవాసులకు హామీ ఇచ్చారు.