HomeHyderabadWe Will Stand By The Residents Of The Ambedkar Huts In Mudfort Says Manne Krishank
గుడిసె వాసులకు అండగా ఉంటాం
కంటోన్మెంట్ జూన్18: మడ్‌ఫోర్ట్‌లోని అంబేద్కర్హట్స్ పేదలగుడిసెల్లో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా రాని బుల్డోజర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, బీజేపీకి చెందిన బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద హయాంలో వచ్చాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ జూన్18: మడ్‌ఫోర్ట్‌లోని అంబేద్కర్హట్స్ పేదలగుడిసెల్లో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా రాని బుల్డోజర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, బీజేపీకి చెందిన బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద హయాంలో వచ్చాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ బోయిన్‌పల్లిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. అన్యాక్రాంతమైన కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి మండల పరిధిలోని సర్వేనంబర్ 157/1 లోని రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ స్థలం విషయమై న్యాయపోరాటం చేస్తామన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేశ్ రూ.5కోట్ల ముడుపులు తీసుకుని కేటీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే తాము చేసే పోరాటానికి మద్దతు ఇచ్చి స్థలం కాపాడి ఆరువేల ఇండ్లు కట్టాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనిత ప్రభాకర్, నళిని కిరణ్, పాండుయాదవ్. శ్యాంకుమార్, లోక్‌నాథ్, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.