జవహర్‌నగర్, ఫిబ్రవరి 20: పస్తులిండి లాఠీ దెబ్బలిని తెలంగాణ ఉద్యమం చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలివ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ నేతృత్వంలో జవహర్‌నగర్ కార్పొరేషన్ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు పిన్నొజు సుధాకర్‌చారి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరూతూ గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డు ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సుధాకర్‌చారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకాలకు 250గజాల ఇంటిస్థలంతో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి అందజేయాలని పేర్కొన్నారు. ఉద్యమంలో పనిచేసి లబ్ధిపొందని వారికి తెలంగాణ సంస్కృతి సారథిలో వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు రాసి పోస్టుడబ్బాలో ఉత్తరాలు రాసి వేశారు. ఈ కార్యక్రమంలో ఆనందాస్ ప్రకాష్, కూటికంటి వెంకటేష్, కుమ్మరి నర్సింహ, సత్యనారాయణ, ఆకుల నర్సయ్య, పాము భాస్కర్, పరుశురాం, ఎల్లస్వామి, సోమయ్య, మహేశ్, కాసీం, చంద్రశేఖర్, నర్సింహయాదవ్, కృష్ణయాదవ్, నరేష్‌యాదవ్, రమేష్‌చారి, పుష్ప, మహేశ్వరి, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.