Mahila Bandhu KCR | మహిళలను గౌరవించే సంస్కృతి మనది : ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్
- తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా సంబురాలు..
- అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
జూబ్లీహిల్స్ : మహిళలను గౌరవించే సంస్కృతి మనదని, తెలంగాణ నుంచి ఈ సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయనున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గురువారం రాత్రి రహ్మత్‌నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి మహిళా బంధు కేసీఆర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారిని గౌరవించిందన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చాటిచెబుతాయన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా షీ టీమ్స్ రక్షణ మహిళలకు అండగా ఉందని, ఇంకా అనేక రకాల కార్యక్రమాలతో మహిళలు ఆత్మస్తైర్యంతో అడుగులు వేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా బాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుటకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మహిళలందరికీ ప్రత్యేక బహుమానాలందించి పలువురు మహిళలను సత్కరించారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

