
బాలానగర్, జనవరి 11 : ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ డివిజన్ లాల్బహదూర్శాస్తీనగర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల హామీలో భాగంగా కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ వడ్డెర కులస్తులకు కార్యాలయ భవనం (మొదటి అంతస్తు) నిర్మించిన సందర్భంగా ఆ సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం సభ్యులు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ సతీశ్గౌడ్లను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ఉన్న సంతృప్తి మరోదాంట్లో లభించదని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కార్పొరేటర్ సతీశ్గౌడ్ చేపట్టడం హర్షణీయం అన్నారు. కె రాములు, భిక్షపతి, శ్రీనివాస్, రాజు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.