కీసర, డిసెంబర్ 22 : కీసర మండలాన్ని అన్ని రంగాల్లో రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యల పై సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ… మంత్రి మల్లారెడ్డి సహకారంతో కీసర మండలానికి అత్యధిక నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని అర్హులైన వారందరికి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, తాసీల్దార్ గౌరీవత్సల, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.