సిటీ బ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): హిమాయత్‌సాగర్ జలాశయం ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమంగా బోర్లు తవ్వి భూగర్భ జలాలను వాణిజ్య ట్యాం కర్ల ద్వారా సరఫరా చేస్తున్నవారిపై జలమండలి చర్యలు తీసుకున్నది. ఈనెల 22న ‘నీళ్లతో లక్షలు గడిస్తున్నారు’ శీర్షకతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనానికి జలమం డలి అధికారులు స్పందించారు. ఈమేరకు హిమాయత్‌సాగర్ గ్రా మం సమీపంలోని ఎఫ్టీఎల్ నంబర్లు 33, 34 పరిధిలో తనిఖీలు నిర్వహించి 2 బోర్లు, నీటిసరఫరా వ్యాపారానికి వినియోగిస్తున్న ఒక నిల్వ ట్యాంక్‌ను గుర్తించారు.
ఈవ్యవహారంపై బుచ్చిబాబు అనే వ్యక్తిపై రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 303(2) ప్రకారం ఎఫ్ఐఆర్ నమో దు చేశారు. భవిష్యత్తులో అనుమతి లేకుం డా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తే చర్యలు తీసుకోవాలని మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల తహసీల్దార్లకు జలమండలి అధికారుల సమాచారం అందించారు. అక్రమార్కులపై వాల్టాతో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.