సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈనెల 19న ఏసీబీ అధికారులు మల్లాపూర్‌లోని లక్ష్మీకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించి, 8 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం తెలిసందే.
ఈ తనిఖీల్లో నిందితుడి ఇంట్లో ఏకంగా రూ. 1.1 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఉన్న 18 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, హైదరాబాద్‌లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్లు, ఒక లగ్జరీ ఇల్లు, కారు, మోటర్ బైక్‌ను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు బుధవారం అనంత లక్ష్మీకుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.