బండ్లగూడ, జూన్ 28: ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో హిమాయత్‌సాగర్‌కు వరద నీరు భారీ స్థాయిలో వచ్చి చేరుతున్నది. హిమాయత్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 1763.50 ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 1762.25 నీటి మట్టానికి చేరడంతో అధికారులు గేటు ఒక ఫిటుమేర ఎత్తి 339 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.