మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 13: తెలంగాణ ద్రోహులను నమ్మోద్దని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి 3వ వార్డులోని వివిధ కాలనీలకు చెందిన 300 మంది బుధవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మహిళలు, యువకులకు మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 3వ వార్డు సాయిదుర్గా రెసిడెన్సి కాలనీ అధ్యక్షులు రామారం టింకు గౌడ్, ఉపాధ్యక్షులు గోపీచంద్, ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్రావు, కోశాధికారి సత్యబాబు, జగదీశ్, కాలనీ వాసులు, డి.ఎస్.ఆర్. కాలనీ అధ్యక్షులు రమణ, ఉపాధ్యక్షలు నిరంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కాలనీ వాసులు, గోకుల్‌నగర్ అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లేశ్, ప్రధాన కార్యదర్శి సురేశ్, కాలనీ వాసులు, తారక ఎన్క్లేవ్ అధ్యక్షులు రామకృష్ణ, ఉపాధ్యక్షులు సిద్దులు, ప్రధాన కార్యదర్శి రాజు, కాలనీ వాసులు, సాహితీ వసంత కాలనీ అధ్యక్షులు చెన్నారెడ్డి, నేతలు రామారావు, కాలనీ వాసులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్లు కళావతి, నాగేశ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు అశోక్ గౌడ్, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, నిమ్మల శ్రీను, రాములు, అంజయ్యగౌడ్, రాహుల్ రెడ్డి, మల్లారెడ్డి, పెంటయ్య గౌడ్, ఎల్లమయ్య, నరేందర్ రెడ్డి, రమేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.