హైదరాబాద్: ఈ నెల 27న హైదరాబాద్‌లో అతివేగంగా వెళ్తున్న ఓ లగ్జరీ కారు.. దాని ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దాంతో ఆటో ఎగిరిపోయి రోడ్డు పక్కన పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వర్షం పడుతున్న సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి ఓవర్ స్పీడ్‌లో వచ్చి ఆటోను ఢీకొట్టి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది.
#WATCH | Hyderabad: Overspeeding luxury car hits auto from behind on the rain-drenched road near Cyberabad's Inorbit Mall on June 27. A passenger riding in the auto was killed in the incident. pic.twitter.com/o3qpdEk0pp
— ANI (@ANI) June 29, 2021