e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News కరోనా టైం వ్యాయామం పదిలం

కరోనా టైం వ్యాయామం పదిలం

కరోనా టైం వ్యాయామం పదిలం
 • వాకింగ్‌కు వెళ్తున్నారా..జాగ్రత్త
 • నిర్ణీత దూరం పాటించాలంటున్న నిపుణులు
 • వాకింగ్‌ సమయంలోనే ఉచ్ఛ్వాస, నిశ్వాసలెక్కువ
 • సమూహంగా వాకింగ్‌ చేయడం మంచిదికాదు
 • గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు బయట చేయకపోవడమే మేలు

కరోనా వేగంగా విస్తరిస్తున్నది. ఎక్కడికెళ్లాలన్నా వైరస్‌ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. నలుగురితో కలిసి మాట్లాడే పరిస్థితి లేదు. గ్రూప్‌ మీటింగ్‌లు, పిచ్చాపాటి ముచ్చట్లు బంద్‌ అయ్యాయి. అయితే కరోనా నుంచి రక్షణకు ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు సూచిస్తుండడంతో నిత్యం అనేకమంది జిమ్‌లకెళ్లడం, ఇతర వ్యాయామాలు చేస్తున్నారు. గతంలో వ్యాయామం చేయని వారు కూడా ఇప్పుడు పార్కులకెళ్లి కసరత్తులు చేస్తున్నారు. వాకింగ్‌కు వెళ్తున్న వారు నిబంధనలు పాటించాలని, లేకుంటే కరోనా బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత తక్కువే అయినా, మనుషులు సమూహాలుగా చేరి వాకింగ్‌ చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని రవి హీలియస్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.విజయ్‌భాస్కర్‌, నేచర్‌క్యూర్‌ హాస్పిటల్‌ ఎండీ డా.భవాని వెల్లడించారు.

ఎదురెదురుగా ఉచ్ఛాస, నిశ్వాసలొద్దు…

పార్కులలో చాలామంది తక్కువ దూరంలో కూర్కొని ఉచ్ఛాస, నిశ్వాసలు చేస్తుంటారు. ఈ సమయంలో ఎదురుగా ఉన్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉండి ఉంటే ముక్కు, నోటిలోకి వైరస్‌ నేరుగా చేరనుంది. ఇది అత్యంత ప్రమాదకరం.

గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలి

నగరంలో గర్భిణులు, చిన్నారులు కూడా వేలసంఖ్యలో నిత్యం వాకింగ్‌ చేస్తుంటారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ జనసాంద్రత తక్కువగా ఉన్న సమయాల్లో మాత్రమే వాకింగ్‌కు వెళ్లాలి. సింగిల్‌ లేయర్‌ మాస్కు తప్పక ధరించాలి. వాకింగ్‌ వెళ్లే ముందు, వచ్చిన తర్వాత చేతులను శానిటైజ్‌ చేసుకోవడంతోపాటు ఆవిరి పట్టుకోవాలి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇంటి బాల్కానీలోనే వాకింగ్‌ చేయడం శ్రేయస్కరం.

ఇవీ తప్పనిసరి

 • కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా నిత్యం నాలుగులీటర్ల నీరు తాగాలి.
 • జ్వరం, ఒళ్లునొప్పులు ఉన్నప్పడు పారాసిటమాల్‌ వేసుకోవాలి. అలాగే ఉసిరి, నిమ్మకాయలతోపాటు పుదీనా జ్యూస్‌, మెంతి కూర తీసుకోవాలి. వీటిలో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. కరోనాను జయించడంలో సి-విటమిన్‌ పాత్ర చాలా కీలకం.
 • పాజిటివ్‌ లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. సొంత ప్రయోగాలు చేయకుండా డాక్టర్ల సలహాలు పాటించాలి. నేచురల్‌ పద్ధతులను కూడా పాటించాలి.
 • కరోనా సోకగానే ఆందోళన చెందొద్దు. స్వల్ప లక్షణాలుంటే ఇంట్లోనే ఉండడం మేలు. జాగ్రత్తలు పాటించి చక్కటి ఆహారం తీసుకుంటే వైరస్‌ను జయించొచ్చు.
 • వాకింగ్‌, ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో మాస్కులు ధరించడం వల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు ఏర్పడుతాయి.
 • ఈ సమయంలో సింగిల్‌ లేయర్‌ మాస్కులు వాడడం మేలు.
 • మాస్కులున్నప్పటికీ వ్యక్తిగత దూరాన్ని పాటించాలి.
 • లేకుంటే ముక్కు, నోరు, కండ్ల ద్వారా వైరస్‌వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

10 మందిలో ఒకరికి ఉన్నా..

 • చాలామంది జిమ్‌లలో కసరత్తులు చేస్తున్నారు. జిమ్‌లో అన్ని మూసివేసి ఏసీ, ఫ్యాన్లు తిరుగుతుంటాయి.
 • దూరం పాటిస్తూనే సుమారు 10 మంది వ్యాయామం చేస్తున్నైట్లెతే ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్‌ ఉన్నా మిగిలిన 9 మందికి సులభంగా వ్యాప్తిస్తుంది.
 • ఆ సమయంలో దగ్గినా, తుమ్మినా, ఉమ్మి వేసినా లక్షల వైరస్‌లు గాలిలో కలిసే అవకాశం ఉంది.
 • చిన్నప్పుడు పాఠశాలల్లో ప్రేయర్‌ చేసేటప్పుడు, మార్చ్‌ఫాస్ట్‌ చేసేటప్పుడు విద్యార్థికి విద్యార్థి మధ్య మూడు అడుగుల దూరం పాటించేవాళ్లం.
 • చిన్నప్పుడు నేర్చుకున్న ఈ విధానాన్ని పెద్దయ్యాక చాలామంది విస్మరిస్తూ గుంపులుగా, సమూహాలుగా ఒకచోట చేరుతున్నారు.
 • ఏ సమయంలోనైనా కొద్దిగా దూరం పాటించడం మేలు.

ఓపెన్‌ ఎయిర్‌లో తక్కువ

 • కరోనా వైరస్‌ వ్యాప్తి ఓపెన్‌ ఎయిర్‌ (బహిరంగ ప్రదేశాల్లో) తక్కువ. చాలామంది కలిసి వాకింగ్‌ చేస్తారు.
 • ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఏ మాత్రం మంచిది కాదు.
 • వాకింగ్‌ చేయాలి, కానీ మనిషికి, మనిషి మధ్య సుమారు 29 ఫీట్ల దూరం ఉండాలి.
 • వాకింగ్‌ చేసే సమయంలో ఉచ్ఛాస, నిశ్వాస వేగంగా జరుగుతుంది.
 • ఈ సమయంలో సుమారు మనిషి లాలాజలం 29 ఫీట్ల దూరం వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. – డా.విజయ్‌భాస్కర్‌, రవి హీలియస్‌ ఆస్పత్రి

దూరం ఒక్కటే మార్గం

 • ప్రస్తుతం వ్యాయామం ఎంత అవసరమో..జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే అవసరం.
 • బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్‌ చేసే సమయంలో కనీసం ఆరు ఫీట్ల దూరం ఉండేలా చూసుకోవాలి.
 • కరోనా వ్యాప్తి నివారణకు దూరం ఒక్కటే మార్గం.
 • సూక్ష్మజీవులు మనిషి కంటికి కనిపించవు. -డా.భవాని, నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా టైం వ్యాయామం పదిలం

ట్రెండింగ్‌

Advertisement