మన్సురాబాద్, మార్చి 2: భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)ను ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా జీఎస్ఐ, జీ ఎస్ఐ టీఐ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని సంజీవయ్య చిల్డన్ పార్క్ వద్ద వాకథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దక్షిణ భారత దేశంలో గత 175 సంవత్సరాలుగా జిఎస్ఐ కార్యాలయం నిర్వహించిన రూపొందించిన సావనీర్ ను జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ డి పట్బాజే ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. జిఎస్ఐ ఉన్నతాధికారులు, సిబ్బంది, వివిధ సంస్థల విద్యార్థులు, విద్యావేత్తలు, జియో సైంటిస్టులు పాల్గొన్నారు.వాకథాన్ సంజీవయ్య చిల్డన్స్ పార్క్ నుంచి ప్రారంభమైంది.