Thalassemia | బన్సీలాల్ పేట్, జూన్ 1: టీం పారస్ సేవ ఆధ్వర్యంలో గాంధీనగర్ కాలనీ కమ్యూనిటీ హాలులో ఆదివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసీమియా సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారికి ఈ శిబిరం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. సామాజిక సేవలో టీం పారస్ సేవ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నదని సభ్యుడు జగదీశ్ తెలిపారు.
ప్రతి జూన్, డిసెంబర్ నెలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వహణ, ప్రతి ఆదివారం క్లాక్ టవర్ వద్ద ఉదయం బ్రేక్ ఫాస్ట్ పంపిణీ, చలికాలంలో అనాథలకు దుప్పట్ల పంపిణీ, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను ఇవ్వడం, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఔషధాలు ఇవ్వడం, క్రీడారంగంలో ఉన్న యువతకు చేయూతనందించే కార్యక్రమాలను గత నాలుగేళ్లుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు రక్తదాన శిబిరానికి సహకారం అందిస్తున్న గాంధీనగర్ కాలనీ అసోసియేషన్‌కు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లను అందించి అభినందనలు తెలిపారు.