Hyderabad | కట్లపాముతో పరాచకాలు.. బొటనవేలిపై కాటేయడంతో మృతి.. వీడియో వైరల్
Hyderabad | స్నేహితులను భయపెట్టాలని ఓ వ్యక్తి చేసిన పిచ్చి పని అతని ప్రాణాలను బలితీసుకుంది. ఫామ్‌హౌస్‌లో కనిపించిన కట్లపాము పిల్లను చేతిలో తీసుకుని పరచకాలు ఆడటంతో.. అది కాటువేసింది.
Hyderabad | స్నేహితులను భయపెట్టాలని ఓ వ్యక్తి చేసిన పిచ్చి పని అతని ప్రాణాలను బలితీసుకుంది. ఫామ్‌హౌస్‌లో కనిపించిన కట్లపాము పిల్లను చేతిలో తీసుకుని పరచకాలు ఆడటంతో.. అది కాటువేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన నవాబ్ జయ్యద్ ఖుమైద్ మొహిద్దీన్ (30) ఒక వ్యాపారవేత్త. తన స్నేహితులతో కలిసి ఇటీవల మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. వారితో సరదాగా గడుపుతున్న సమయంలో అక్కడకు ఒక కట్లపాము పిల్ల వచ్చింది. దాన్ని చూడగానే నవాబ్ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పాముతో తన స్నేహితును భయపెట్టాలని అనుకున్నాడు. ఆ కట్ల పాముతో ఆటలు ఆడుతూ స్నేహితులను భయపెట్టబోయాడు. కానీ ఇంతలో కుడి చేతి బొటనవేలుపై కాటేసింది.
చిన్న పాము కదా.. పెద్దగా ప్రమాదం ఉండదని వాబ్ లైట్ తీసుకున్నాడు. స్నేహితుల ముందు నవ్వుకుంటూ.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, చికిత్స అవసరం లేదని స్నేహితులతో చెప్పుకొచ్చాడు. కానీ చిన్నదైనా, పెద్దదైనా కట్లపాము విషం అత్యంత ప్రమాదకరమేని అతను తెలుసుకోలేకపోయాడు. ఇంకేముంది.. కొద్దిసేపట్లోనే కట్ల పాము విషం నవాబ్ శరీరంపై ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ముందుగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. క్రమంగా ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆందోళన చెందిన స్నేహితులు నవాబ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే విషం శరీరం మొత్తం పాకడంతో నవాబ్ కన్నుమూశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
కట్ల పాముతో ఆటలాడుతూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
హైదరాబాద్ – రాజేంద్రనగర్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్‌లో దూరిన కట్లపామును పట్టుకున్న ఇంటి యజమాని నవాబ్
చేతులతో పట్టుకొని ఆటలాడుతుండగా నవాబ్‌ను కాటేసిన పాము
ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ 3 గంటల్లోనే మృత్యువాత పడ్డ యజమాని pic.twitter.com/mxbKtAbUit
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

