సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే క్రేన్ల పనితీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ట్యాంక్‌బండ్ సుందరీకరణలో భాగంగా ప్రత్యేకంగా రాళ్లతోకూడిన ఫ్లోరింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడే భారీ క్రేన్లతో వాహనాల నుంచి విగ్రహాలను తరలించి సాగర్‌లో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుందరీకరణ పనులకు ఎలాంటి నష్టం కలుగకుండా నిమజ్జనం జరిగేలా చూడాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పోలీసులకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. ట్యాంక్‌బండ్‌తో పాటు ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో అదనంగా నిమజ్జనం కోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అర్వింద్‌కుమార్ తెలిపారు