ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి
పట్నం నుంచి పల్లె వరకు ఆరోగ్య సేవలు విస్తరణ
నగరం నలుమూలలా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు
మెగా ఆరోగ్య మేళాలో మంత్రి సబితారెడ్డి
బడంగ్‌పేట, ఏప్రిల్21: ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య మేళాను జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగ ల అనితాహరినాథ్ రెడ్డి, మేయర్లు దుర్గా దీప్లాల్ చౌహ న్, పారిజాతనర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్లు విక్రంరెడ్డి, ఇబ్రాంశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ అరుణతో కలిసి ఆమె ప్రారంభించారు.
క్యాంప్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బస్తీ దవాఖానల మాదిరిగానే త్వరలో గ్రామాల్లో పల్లె దవాఖానలను ఏర్పాటు చేయబోతున్నామని ఆమె తెలిపారు. ఇప్పటికే పీహెచ్‌సీల్లో ఉచితంగా 56 రకాల టెస్టులు చేస్తున్నామన్నారు.బ్యానర్ల ద్వార, కరపత్రాల ద్వార ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న సేవలపై ప్రచారం చేయాలని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లకు సూచించారు.
బీపీ, షుగర్ ఉన్న వారికి ఉచితంగానే ముందులు ఇస్తున్నామన్నారు.వందల పడకల దవాఖాన ఏర్పాటు చేయించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.అందుకు సీఎం సానుకూలంగా స్పం దించారని ఆమె తెలిపారు. ఇతర దేశాల్లో మాదిరిగానే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నారు. నగర నలుమూలలా మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నామని ఆమె అన్నారు.
పట్నం నుంచి పల్లె దాఖ ఆరోగ్య సేవలు విస్తరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ చేయించిన ఫీవ ర్ సర్వే ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కరో నా సమయంలో ఆశ, వైద్య, అంగన్వాడీ సిబ్బంది చేసిన సేవలను ఆమె కొనియాడారు. అనంతరం జడ్పీచైర్ పర్సన్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో డాక్టర్లు అరు ణ, జనార్దన్, వినోద్,కార్పొరేటర్లు, వైద్య సిబ్బంది, శారద భవ్య, అజిమ్, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, టెక్నీషియన్లు, తదితరులు ఉన్నారు.
నాలా పనులు పరిశీలన
మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న నాలా అభివృద్ధి పనులను గురువారం మంత్రి పి సబితారెడ్డి పరిశీలించారు. సందచెరువు, మంత్రాల చెరువు, ఎంఎల్ఆర్ కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించారు.అనం తరం పనులను వానకాలంలోపు పూర్తి చేయాలని సూ చించారు.పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు.