Veterinary Doctors | వ్యవసాయ యూనివర్సిటీ, మే 29 : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గల రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగం హెడ్ డాక్టర్ రామ్ సింగ్ సూచించారు. రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పెంపుడు జంతువులలో ప్రధానంగా ఆవులు, గేదలు, కుక్కల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
సమీపంలో గల వెటర్నరీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వీలైనంతవరకు మాంసాహారాన్ని తగ్గించి, శాఖాహారాన్ని ఇవ్వడంతో పాటు, వాటిని శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు కాచిన నీటిని తాపితే సరిపోతుందని ఆయన సూచించారు. అస్వస్థతకు గురైన జంతువులను రాజేంద్రనగర్ వెటర్నరీ ఆస్పత్రికి తీసుకురావాలని చెప్పారు.