హైదరాబాద్ : నాకు తెలిసి సొంత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూసే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి భవనాలకు మూడేళ్లుగా మెయింటైనన్స్ నిధులు కేటాయించడంలేదని ఆరోపించారు.
కేసీఆర్ కట్టించాడు కాబట్టి నిధులు ఇవ్వకుండా అది చెడిపోతే ఆయనను బద్నాం చేయాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు అమరజ్యోతి భవనంలో వైర్లను ఎలుకలు కొరుకుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం వద్ద గేటుకు తాళం వేసి ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజల ఆస్తులను కాపాడాలని సూచించారు.