e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home హైదరాబాద్‌ తిరిగేవన్నీటైర్లు కావు!

తిరిగేవన్నీటైర్లు కావు!

తిరిగేవన్నీటైర్లు కావు!
  • నాణ్యత లేని చక్రాలతో చిక్కులే
  • వర్షంలో జారి పడుతున్న వాహనదారులు
  • ప్రాణాల మీదికి తెస్తున్న నిర్లక్ష్యం
  • వాడని టైర్లతో జరభద్రం
  • హార్డ్‌గా మారి బ్లాస్‌ అయ్యే అవకాశాలు

వానలు దంచి కొడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాహనాలు అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. టైర్లు గ్రిప్‌ కోల్పోతుండటం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొన్ని ఘటనల్లో వాహనదారులు ప్రాణాలను కోల్పోతున్నారు. వర్షాకాలంలో వాహనాల టైర్ల నాణ్యత సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువని పలువురు మెకానిక్‌లు సూచిస్తున్నారు. పేలుతున్న టైర్లు.. రోడ్లపై జారుతున్న బండ్లపై వాహనదారులకు అవగాహన తక్కువని.. ఫలితంగా వాహనం కండీషన్‌ బాగున్నా డ్రైవ్‌ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని వివరిస్తున్నారు.

చక్రాలు సాఫీగా తిరగాల్సిందే..

  • ఏ వాహనానికైనా చక్రాలు అత్యంత ముఖ్యం. బండి కండీషన్‌ ఎలా ఉన్నా ముందుకు వెళ్లాలంటే టైర్లు ఉండాల్సిందే. అవే లేకుంటే ఏం చేయలేం. అంతటి ప్రాధాన్యం గల చక్రాలపై వాహనదారులు అవగాహన పెంచుకోవాలి.
  • ముఖ్యంగా టైర్ల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. చాలా మంది టైర్ల గ్రిప్‌ పోయినా నిర్లక్ష్యంతో వాహనాన్ని అలానే నడుపుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. టైర్లు బాగా లేకపోవడం ప్రమాదాలకు కారణమని గుర్తించాలి.
  • టైర్లల్లో సరిపడా గాలి ఉండేలా చూసుకోవాలి. టైరు పరిణామాన్ని బట్టి గాలిని నింపాలి. 14 ఇంచుల టైర్‌లో 29, 15 ఇంచుల టైర్‌లో 30, 16 ఇంచులైతే 36 పాయింట్ల వరకు గాలిని ఫిల్‌ చేయాలి.
  • వాహనాన్ని ఎక్కువగా వాడకపోతే టైర్లు హార్డ్‌గా మారే ప్రమాదం ఉంది. సరిగా టైర్లు లేనప్పుడు నడిపితే మేకులు, బండలు గుచ్చికున్నప్పుడు లేదా బ్రేకులు వేయడానికి ప్రయత్నిస్తే వాహనం టైర్‌ పగిలిపోయే ప్రమాదం ఉంది.
  • వాహనదారులు ఇష్టారీతిన డ్రైవ్‌ చేయడం ప్రమాదమే. ముఖ్యంగా సడెన్‌ బ్రేకులు వేయడం.. స్పోర్ట్స్‌ వాహనాల మాదిరి వీల్స్‌ను ఎక్కువసార్లు అటూ ఇటూ తిప్పడం కూడా టైర్‌ నాణ్యతపై ప్రమాదం చూపుతుంది. నెమ్మదిగా టైర్లు గ్రిప్పును కోల్పోతాయి.
  • ప్రతి ఐదు వేల కిలోమీటర్లకు ఒకసారి తప్పనిసరిగా వీల్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేయాలి. టైర్లలో ఎయిర్‌ ఎంతుందో చూసుకోవాలి.
  • 40 వేల కిలోమీటర్లు తిరిగిన ప్రతీ వాహనం టైర్లను మార్చాలి.
  • టైర్లను కొనుగోలు చేస్తున్నప్పుడు పాత తేదీల్లో తయారైన టైర్లను ఎంచుకోవద్దు. ఏ సంవత్సరం తయారైన టైర్‌ను ఆ సంవత్సరంలోనే వాడాలి. కాల పరిమితితో సంబంధం లేకుండా టైర్లను కొనుగోలు చేసి వాడితే ప్రమాదాల బారిన పడటం ఖాయం.
  • ఎప్పటికప్పుడు టైర్లలోని గాలిని చెక్‌ చేసుకోవాలి. వాహనాన్ని ముందుకు వెనక్కి తిప్పడం ద్వారా టైర్లలో గాలి ఎంతుందో తెలుసుకునే వీలుంది. టైర్లలో తక్కువ గాలి ఉంటే ఇంజిన్‌పై ఒత్తిడి పడుతుంది. ఇది కారు మైలేజీని దెబ్బతీస్తుంది. అంతేకాక టైర్లు త్వరగా అరిగిపోతాయి.
  • పార్కింగ్‌ చేసినప్పుడు హ్యాండ్‌ బ్రేక్‌ను తీసి ఉంచాలి. దీంతో కారు నాలుగు టైర్లు సమానంగా భూమిపై ఉంటాయి. లేదంటే టైర్లు హార్డ్‌గా మారే ప్రమాదం ఉంటుంది.
  • టైర్లు సరిగా లేకపోతే ఒక్కోసారి బ్రేకులు పడవు. అందుకే టైర్ల గ్రిప్పులపై దృష్టి సారించాలి.

సమయానికి టైర్లను చెక్‌ చేయించాలి

లక్షలు ఖర్చు చేసి వాహనాలు కొంటున్నా వాటి నిర్వహణపై వాహన యజమానులు సరైన శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా టైర్లను అసలు పట్టించుకోవడం లేదు. తరచూ వీల్స్‌ చెక్‌ చేస్తూ నాణ్యత లేకపోతే మార్చుకోవాలి. తక్కువ ధరకు దొరుకుతున్న, కాలం చెల్లిన టైర్లను అస్సలు కొనుగోలు చేయవద్దు. వాహనం నిర్వహణ విషయంలో రాజీ పడొద్దు. -నితిన్‌, వాహనదారుడు

టైర్ల గ్రిప్‌ చెక్‌ చేసుకోవాలి..

- Advertisement -

కారు మోడల్‌.. వాటికి ఉన్న టైర్ల పరిణామాన్ని బట్టి గాలి నింపాలి. సాధారణంగా 32 పాయింట్ల గాలి నింపితే సరిపోతుంది. కొన్ని వాహనాల్లో ఒకటి రెండు పాయింట్లు ఎక్కువ తక్కువ ఉంటుంది. ఎక్కువ రోజులు ఒకే చోట పార్క్‌ చేసి ఉంచితే ఆ వాహనం లైఫ్‌పై దుష్ప్రభావం పడుతుంది. కారు ఎక్కువగా వాడే వారు దాని నిర్వహణపై శ్రద్ధ చూపాలి. కారును వాడని వారు కనీసం పది నుంచి 15 నిమిషాల పాటు స్టార్ట్‌ చేసి ఉంచాలి. ఇలా నెలకు ఒకటి రెండు సాైర్లెనా చేయాలి. వర్షాకాలంలో బ్రేకులు త్వరగా పాడైపోతాయి. టైర్లు బాగుంటేనే స్పీడ్‌ కంట్రోల్‌ చేయగలం. లేకపోతే బ్లాస్ట్‌ అవుతాయి. -దీపేశ్‌ బజాజ్‌, మెకానిక్‌ షాప్‌ నిర్వాహకుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తిరిగేవన్నీటైర్లు కావు!
తిరిగేవన్నీటైర్లు కావు!
తిరిగేవన్నీటైర్లు కావు!

ట్రెండింగ్‌

Advertisement