కేపీహెచ్బీ కాలనీ : కూకట్పల్లి పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ రైతుబజార్లో శుక్రవారం కూరగాయల ధరలు (కేజీ-రూపాయలు) కింది విధంగా ఉన్నాయి. టమాట 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చిమిర్చి 35, బజ్జి మిర్చి 45, కాకరకాయ 35, బీరకాయ 35, క్యాబేజి 13, ఫ్రెంచ్ బీన్స్ 85, క్యారెట్ 27, కాలీఫ్లవర్ 23, దొండ 25, చిక్కుడు 55, గోరుచిక్కుడు 35, బీట్రూట్ 25, క్యాప్సికం 45, ఆలుగడ్డ 25, కీరా 18, దోసకాయ 18, సొరకాయ 12, పొట్లకాయ 18, కందగడ్డ 75, ఉల్లిపొరక 35కు అమ్ముడవుతున్నాయి.
అదేవిధంగా ఉల్లిగడ్డ 18, మామిడి కాయ (1) 15 నుంచి 20, అరటికాయ 9 నుంచి 11, చామగడ్డ 31, ముళ్లంగి (1) 4 నుంచి 5, మొరంగడ్డ 28, గుమ్మడికాయ 25, నిమ్మకాయలు (12) 60 నుంచి 70, మునగకాయ (1) 5 నుంచి 6, పొప్పడికాయ 40, పుట్టగొడుగులు 40, ఎండుమిర్చి 160, అల్లం 80, వెల్లుల్లి 140, చింతపండు 160, కరివేపాకు 70 ధర పలుకుతున్నాయి. ఈ ధరలు శనివారం ఉదయం 9.30 గంటల వరకు రైతుబజార్లో అమలులో ఉంటాయని ఎస్టేట్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు.