హైదరాబాద్: వెరైటీ వెదర్ (Variety Whether).. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వైపు ఎండ కొడుతుంగా, మరో వైపు వాన (Rain) పడుతున్నది. నగరంలో గత కొన్నిరోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తనను మర్చిపోతారునుకున్నాడో ఏమో.. తానున్నానని సురసురమంటూ సోమవారం ఉదయం ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు. అయితే కొద్దిసేపటికే ఆ సెగలను చల్లార్చేలా వరణుడు జల్లులు కురిపించాడు. దీంతో వింత వాతారణం అనుకుంటూ ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు.
కాగా, ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఫిలింనగర్, యూసఫ్‌గూడ, మణికొండ, పెన్షన్ ఆఫీస్, అబీడ్స్, లక్డీకపూల్, కోఠి, సుల్తాన్‌బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ముషీరాబాద్, సికింద్రాబాద్, వెస్ట్‌మారేడ్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.