జవహర్‌నగర్, జనవరి 6 : సీఆర్పీఎఫ్ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నదని సీఆర్పీఎఫ్ సౌత్‌జోన్ ఏడీజీ ఎస్ఎస్ చతుర్వేది అన్నారు. శుక్రవారం సీఆర్పీఎఫ్ పాఠశాల క్యాంపస్‌లో ఉత్కర్ష్ వార్షిక క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీజీ ఎస్ఎస్ చతుర్వేది హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యాన్ని ఎంచుకొని సృజనాత్మకతతో కూడిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డీఐజీపీ అనిల్మిన్జ్, పాఠశాల ప్రిన్సిపాల్ డి.అపర్ణ, హెచ్ఎం ఆశాజీకుమార్, ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్, భాస్కర్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.