కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ మండలంలోని తాహెర్ కొండాపూర్‌కు చెందిన 27 మందికి మంజూరైన దళితబంధు యూనిట్లను శనివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.