Congress | సిటీబ్యూరో: తుక్కుగూడలో శనివారం జరిగిన కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
ఇప్పటికే తక్కువ సర్వీసులతో బస్సులు నడుస్తుంటే ఉన్న వాటిని కాంగ్రెస్ సభకు తరలించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఎండలో గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.