ఉప్పల్, జూలై 7: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను మంగళవారం మరోసారి తిరిగి పంపించారు. ప్రజాప్రతినిధిగా తనకు ప్రజల ప్రేమాభిమానాలు, విశ్వాసమే నిజమైన భద్రత అని ఆయన ఈ సందర్భంగా పేరొన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిషారానికి కృషి చేయడం తన బాధ్యత అని, అదనపు భద్రత అవసరం లేదనే తన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు.
ప్రజలతో నిత్యం మమేకమై, అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజలతో లక్ష్మారెడ్డికి ఉన్న అనుబంధం, నిరాడంబరత, ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను మరోసారి చాటుకున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేరొన్నారు.