ఉప్పల్ / చర్లపల్లి, ఆక్టోబర్ 30 : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ కడియాల అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అలాగే బీఆర్ఎస్పార్టీ నాయకుడు పూడూరి జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పండ్ల కిషన్‌గౌడ్, బిక్కు, దయానంద్ సమక్షంలో ఉప్పల్ సాయిబాబా కాలనీ అధ్యక్షుడు తిరునగరి అనిల్‌కుమార్, కమల్, విజయపురి కాలనీవాసులు గొటికె రవీందర్‌రెడ్డి, చంద్ర, తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. చర్లపల్లి డివిజన్‌కు చెందిన కడియాల అనిల్‌కుమార్, దర్శనం బాలకృష్ణ, శ్రావణ్, రాజు, భానుప్రకాశ్, కిరణ్, నాగరాజు, ఆర్కే.వంశీ, శివ, కే.శివ, ప్రకాశ్, పల్లవ్, ప్రభు, ఆఫాన్, డీ.వంశీ బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేశ్‌గౌడ్, బాల్‌రెడ్డి, కనకరాజుగౌడ్, నర్సింహ, యాదగిరి, రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహ వంశరాజు, లక్ష్మయ్య, సోమయ్య, పాల్గొన్నారు.