చర్లపల్లి/ కాప్రా, జనవరి 11: భూగర్భ డైనేజీలో రసాయనాలను వదిలిన వారిని గుర్తించి తగుచర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని వెంకట్‌రెడ్డినగర్, మధుసూదన్రెడ్డినగర్, అయ్యప్పకాలనీ తదితర ప్రాంతాలలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, వివిధ విభాగాల అధికారులతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేలుడు ఘటనపై విచారించి తగుచర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ పంకజ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనార్డ్రాస్ అదేశాల మేరకు చర్లపల్లి డివిజన్లో పర్యటించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ కమిషనర్ ముకుంద్‌రెడ్డి, ఈఈ హిరాలాల్, ఏఈ స్వరూప, వివిధ విభాగాల అధికారులు, చర్లపల్లి ఐలా అధికారులు, పీసీబీ అధికారులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరానగర్ ఫేజ్-2 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి.శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్, కాలనీ అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, సెక్రటరీ కాళీ, సతీష్, అలీముద్దీన్, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉప్పల్, జనవరి 11 : ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలోని ప్రజాపాలన దరఖాస్తుల డేటా కేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఆరు గ్యారంటీలలో భాగంగా చేపడుతున్న దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీ శ్రీనివాస్, నేతలు ఆకుల మహేందర్, అన్య బాలకృష్ణ, కిశోర్, తదితరులు పాల్గొన్నారు.