రామంతాపూర్, అక్టోబర్ 31 : ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తాను ఎమ్మెల్యేగా గెలువగానే చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మంగళవారం చిలుకానగర్‌లో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చిలుకానగర్ డివిజన్లో కార్పొరేటర్ బన్నాల గీత రెండున్నర సంవత్సరాల్లో రూ.65 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ చొరవతో సర్వేనంబర్ 44లోని కల్యాణపురి ఇంటి పర్మీషన్ల విషయంలో ఓపెన్ జోన్‌నుంచి రెసిడెన్షియల్ జోన్ చేయించామన్నా రు.
ఈ సందర్భంగా పలు కాలనీల సంఘాలవారు బం డారి లక్ష్మారెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అజ్మత్నగర్ కాలనీ ప్రజలందరూ ముందుకు వచ్చి బండారి లక్ష్మారెడ్డికి ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రా గిడి లక్ష్మారెడ్డి, 25 కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, వేణుగోపాల్, ధర్మపురి, సాయిరాఘ వేంద్ర, జయరాఘవేంద్ర, దుర్గా రాఘవేంద్ర, కల్యాణపురి, నార్త్ కల్యాణపురి, ఈస్ట్ కల్యాణపురి, బాలాజీ ఎన్క్లేవ్, అన్నపూర్ణ, బ్యాంక్ కాలనీ, జాహెద్నగర్, అంబేద్కర్ నగర్, ఇందిరానగర్, సీతారాం కాలనీ, టీచర్స్‌కాలనీ, హైకోర్టు కాల నీ, శ్రీనగర్ కాలనీ, లక్ష్మీనారాయణకాలనీ, ప్రశాంత్‌నగర్, న్యూప్రశాంత్నగర్, సౌత్ ప్రశాంత్‌నగర్, తదితర కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
బండారికి పలు సంఘాల మద్దతు..
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి కృష్ణమూర్తి, టీఎం ఆర్పీఎస్ ఇటిక రాజు, ప్రజా సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ప్రకటన చేశా రు. ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తమ ట్రస్టు ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామ న్నా రు. ఈ కార్యక్రమంలో టీఎంహెచ్డీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకరాజు, మల్లేశ్, మధు,జిల్లా అధ్యక్షురాలు ఎస్. అనిత, జె.రామయ్య, మంగ తదితరులు పాల్గొన్నారు.