BJP Leaders | ఉప్పల్, మార్చి 20 : చిలకానగర్ డివిజన్ నాయకుల ప్రమేయం లేకుండా డివిజన్ అధ్యక్ష పదవిని ఏకపక్షంగా ప్రకటించినందుకు నిరసనగా బీజేపీ సీనియర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీ ప్రకటించిన డివిజన్ అధ్యక్షుడి ఎంపికను తాము అంగీకరించే ప్రసక్తి లేదని నాయకులు తేల్చిచెప్పారు. సీనియర్ నాయకుల సూచనలు, సలహాలు తీసుకోకుండా, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించకుండా డివిజన్ అధ్యక్ష ఎన్నిక జరిగిన విధానాన్ని సహించేది లేదని సీనియర్ బీజేపీ నాయకులు తేల్చిచెప్పారు. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. డి
ఆనవాయితీ ప్రకారం డివిజన్ నాయకులందరి నిర్ణయం మేరకు అధ్యక్షుడి ఎంపిక జరగాల్సిందే అని పేర్కొన్నారు. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన అధ్యక్ష ఎంపిక ప్రక్రియను సహించేది లేదన్నారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల చిలకానగర్ డివిజన్ సీనియర్లంతా పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆచారి, రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర బీజేపీ సంఘటన్ మంత్రి చంద్రశేఖర్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్‌కు ఇప్పటికే వినతిపత్రాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. నామినేషన్ ప్రక్రియ జరిగిన రోజున సంబంధిత వ్యక్తి హాజరు కాలేదని, పైగా ఎన్నికలలో భాగమైన బూత్ కమిటీ అధ్యక్షులు జాబితా జారీ చేయలేదన్నారు. ఎన్నికల అధికారిని బెదరించి, కొంతమంది రాజకీయ నాయకుల ప్రభావం చేత ఎన్నిక చేయడం దుర్మార్గని సీనియర్లు పేర్కొంటున్నారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా జరిగిన ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీనియర్లు ప్రకటించారు.