సుల్తాన్ బజార్, జూన్ 25: జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమస్యలను పూర్తిగా పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఉస్మానియా జూడా అధ్యక్షుడు డాక్ట ర్ దీపాంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రికారెడ్డిలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నిరవధిక సమ్మెలో రెండో రోజు ఉస్మానియా దవాఖానాలో ర్యాలీని నిర్వహించిన అనంతరం, సూపరింటెండెంట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ‘సీఎం రావా లి, ఉస్మానియాకు నూతన భవనం నిర్మించి మమల్ని బతికించాలి, ఉస్మానియాకు పాత భవనం వద్దు, నూతన భవనమే ముద్దు, టీ జూడాల అన్ని సమస్యలను పరిష్కరించాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొంత కాలంగా జూడాలు నిరసన కార్యక్రమాలు జరుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ఏమిటి? అని వారు ప్ర శ్నించారు. తమ రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల స్థలంలో హై కోర్టు నిర్మాణం కోసం శంకుస్థాసన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పేద రోగులు చికిత్సలు పొందే ఉస్మానియా దవాఖాన నూతన భవనం నిర్మాణం విషమం లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమ ని ఆరోపించారు. దేశంలోని కశ్మీర్, బీహార్, చత్తీస్‌గఢ్ వంటి దూర ప్రాంతాల నుంచి సూ పర్ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో విద్యను అభ్యసించేందుకు వచ్చే వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కళాశాలలు, దవాఖానాలు వెక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జూడాలు డాక్టర్లు ఇసాక్ న్యూటన్, రాహుల్, చంద్రకళ పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్, జూన్ 25: జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని సమ్మె రెండో రోజైన మంగళవారం గాంధీ దవాఖానలో జూడాలు విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. దవాఖాన ప్రధాన భవనం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేంత వరకు నిరవధికంగా సమ్మె చేస్తామని జూడా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాయి హర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణలు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు, ఐసీయూలను మినహాయించి, మిగతా అన్ని విభాగాలను తాము బహిష్కరించామని చెప్పారు. వైద్య విద్యార్థులమైన తమకు ఉద్యమాలు చేయాలన్నది లక్ష్యం కాదని, ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు.