Ghatkesar | ఘట్కేసర్, మార్చి 14 : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి ఎన్ఎఫ్ సీ నగర్ సమీపంలోని బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తిని వెనుకాల నుండి వేగంగా వచ్చిన వాహనం డీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ దవాఖానకు తరలించినట్లు చెప్పారు. మృతిని వివరాలకు ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712662705 నెంబర్ సంప్రదించాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.