సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజేందర్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇంటింటికీ చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలని, కార్మికులకు బీమా కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కాట్రావల్ గోపాల్ నాయక్, హంసరాజు, అర్జున్, శేఖర్, పరశురాం, మచ్చగిరి, మహానంది, లక్ష్మణ్, రాము తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్ట్లో చేర్చిన బీసీల డిమాండ్లను వెంట నే అమలు చేయాలని రాజ్యసభ సభ్యు డు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఆర్.కృష్ణ య్య కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ యువజన అధ్యక్షుడు గువ్వల భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ న్యాయవాదుల
నాంపల్లి కోర్టులు : తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంద కోట్లు విడుదల చేసిందని, యథావిధిగా వంద కోట్లను సంక్షేమ నిధికి అందజేయాలని కోరుతూ తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డితో పాటు సభ్యులు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, వినతి పత్రం సమర్పించారు. సీఎంను కలిసిన వారిలో బార్ కౌన్సిల్ సభ్యులు జితేందర్‌రెడ్డి, కొండారెడ్డి, మోహన్‌రావు, జి.రామారావు తదితరులు ఉన్నారు.