హిమాయత్‌నగర్,సెప్టెంబర్ 25: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ బీవీ విజయలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు పి.ప్రేంపావని, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో యూనియన్ రాష్ట్ర కమిటీ సమావే శం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంట కార్మికులను కాదని ప్రభుత్వం హరే రామ హరేకృష్ణ ఫౌండేషన్‌కు మధ్యాహ్న భోజన పథకాన్ని కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వంట కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.10వేల వేతనంతోపాటు బకాయి వేతనాలు ఇవ్వాలన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి మెస్ చార్జీలు రూ.25 ఇవ్వాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, నాయకులు డి.కమలారెడ్డి, రమేశ్, విజయలక్ష్మి, చక్రపాణి, సాయిలు, రామ్మూర్తి, రామకృష్ణ, లక్ష్మణ్, ప్రభావతి, మంగ, రజిత, జైపాల్‌రెడ్డి, ఇందిర, కొమురమ్మ, సూరమ్మ, తదితరులు పాల్గొన్నారు.