వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 26 : రైతుకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అన్నారు. రాజేంద్రనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్సెటెంషన్ మేనేజ్మెంట్ 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
దేశంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపై జీవనం సాగిస్తున్నారని తెలిపారు. 2018 నుంచి 2022 వరకు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 202 మంది పీజీడీఎం (ఏబీఎం) విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ పథకాలను అందజేశారు. అంతకు ముందు మేనేజ్మెంట్ ఆవరణలో కొత్తగా నిర్మించిన కృషి చాణ్యక భవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోజ్ అహుజ, డైరెక్టర్ ఆఫ్ జనరల్ పి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.