పరారీలో బండి భగీరథ్
మైనర్‌పై లైంగికదాడికి సంబంధించి పోక్సో కేసు నమోదై విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షంచాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈమేరకు బీఆర్ఎస్ సహా పలు ప్రజా, కుల సంఘాలు బుధవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మైనర్‌పై లైంగికదాడికి సంబంధించి పోక్సో కేసు నమోదై విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షంచాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈమేరకు బీఆర్ఎస్ సహా పలు ప్రజా, కుల సంఘాలు బుధవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలుచోట్ల బండి భగీరథతో పాటు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో బండి భగీరథ్‌ను పట్టిస్తే రివార్డు ప్రకటిస్తామని పోస్టర్లు సైతం వెలిశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
సమగ్ర విచారణ జరిపించాలి
చిక్కడపల్లి, మే13: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. బాగ్‌లింగంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. చట్టం భారత పౌరులందరినీ సమానంగా చూడాలని.. ధనవంతులకు ఒక న్యా యం, పేదలకు ఒక న్యాయం ఉండకూడదన్నారు. నిందితుడు బండి భగీరథ్‌పై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలి

కుత్బుల్లాపూర్, మే13: కుమారుడిపై నమోదైన పోక్సో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర మంత్రి బండిసంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మహిళాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఐఎఫ్టీయూ, పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ ప్రతినిధులు బుధవారం బైఠాయించి నిరసనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి వేరే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

కవాడిగూడ, మే 13: పోఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు. న్యాయం కోసం పోరాటం అన్న నినాదంతో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేదర్కర్ విగ్ర హం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు మల్లు లక్ష్మి, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి, పీవోడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సంధ్య, జాతీయ నాయకురా లు ఝాన్సీ, ఎఐఎంఎస్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి హేమలత, ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకురాలు ఎస్.ఎల్.పద్మ పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలి

బంజారాహిల్స్, మే 13: కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ముట్టడికి యత్నించారు. పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదై ఐదురోజులు గడిచినా బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వైపు వెళ్తున్న బక్క జడ్సన్‌ను పోలీసులు అడ్డుకుని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం

కవాడిగూడ, మే 13: మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడు బండి భగీరథ్ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు కావడంతోనే అతన్ని అరెస్టు చే యడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధర్మసమాజ్‌పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గుడపర్తి సంతోష్‌కుమార్ ఆరోపించారు. కవాడిగూడలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్‌కుమార్, నాయకులు శివప్రసాద్‌గౌడ్, సాయిగోపాల్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీననామా చేయాలన్నారు. బాధితురాలకి న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

