మలక్‌పేట, మే 4: శిథిలావస్థలో ఉన్న కాచిగూడ బాలుర వసతిగృహం కాంప్లెక్స్, మూషీరాబాద్, బోలక్పూర్ బాలికల వసతిగృహాల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించి, నూతన భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు వినతిపత్రాన్ని సమర్పించారు.
తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేశ్‌కుమార్, టీఎస్ఎస్ఏ నాయకుడు మేడి నాగరాజు ఆధ్వర్యంలో పలువురు ఆదివారం కోకాపేటలోని నివాసంలో మంత్రిని కలిసి వసతి గృహాల పరిస్థితిని వివరించారు. నిధులు విడుదలజేసి నూతన భవనాలను నిర్మించాలని వారు మంత్రిని కోరారు.