Town Planning | జూబ్లీహిల్స్, జూన్ 21 : యూసుఫ్‌గూడ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అనిశ్చితి కొనసాగుతుంది. తరచుగా ఏసీపీల బదిలీలు చోటు చేసుకుంటుండగా గత అక్టోబర్‌లో న్యాక్ ఇంజినీర్, చైన్‌మెన్ బదిలీలు జరిగాయి. ఏడాది క్రితం వచ్చిన సెక్షన్ ఆఫీసర్ సైతం తాజాగా బల్దియా కమిషనర్ చేపట్టిన ప్రక్షాళనలో సర్కిల్-10 ఫలక్‌నూమాకు బదిలీ అయ్యారు. అయితే ఇప్పటికే ఒకే ఒక్క సెక్షన్ ఆఫీసర్‌తో కొనసాగుతున్న 19వ సర్కిల్‌కు తాజా బదిలీలలో పూర్తిస్థాయి అధికారి నియామకం చేపట్టలేదు. హయత్ నగర్ సర్కిల్ నుంచి శేరిలింగంపల్లి సర్కిల్‌కు బదిలీ అయిన ఎండీ అక్బర్ అహ్మద్‌కు యూసుఫ్‌గూడ సర్కిల్ ఇంఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. సదరు అధికారి శేరిలింగంపల్లి ఎస్ఓగా బాధ్యతలు తీసుకుని యూసుఫ్‌గూడ సర్కిల్‌కు అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద కూడా ఇటీవలే ఈ సర్కిల్ కు బదిలీపై వచ్చారు.