దుండిగల్, సెప్టెంబర్ 10: అకారణంగా తనపై నిందారోపణలు మోపడంతో పాటు అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి, చంపుతామని బెదిరించడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధి, కైసర్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మగ్దుంనగర్కు చెందిన బియ్యంపల్లి జ్యోతి, రాజు(55) దంపతులకు గాజులరామారం డివిజన్ పరిధి, కైసర్‌నగర్‌లోని డబుల్బెడ్రూం ఇండ్లల్లోని 6వ బ్లాక్, 302 ఫ్లాట్‌ను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది.
దీంతో కైసర్‌నగర్‌లోని డబుల్బెడ్రూం(డిగ్నిటీ హౌజెస్) ప్రారంభమైన నాటి నుండి దంపతులు అక్కడే నివాసముంటున్నారు. రాజు బాలానగర్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా జ్యోతి గృహిణి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న రాజు మెట్లు ఎక్కుతుండగా నౌసీన్ అనే మహిళ తన చేయి పట్టుకున్నాడంటూ అల్లరిపెట్టింది.
సంక్షేమ సంఘం ప్రతినిధులు కలుగజేసుకుని మాట్లాడి ఎవరి ఫ్లాట్‌కు వాళ్లు వెళ్లండని పెద్దలు సూచించి అక్కడి నుండి వెళ్లిపోయారు. నౌషీన్ తెల్లవారు జామున కొంతమంది వ్యక్తులతో వచ్చి రాజు ఇంటి తలుపులు పగులగొట్టారు. తానేతప్పు చేయలేదని ప్రాధేయపడినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో కాలనీలో తన పరువు పోవడంతోపాటు చేయని తప్పుకు నిందారోపణలు మోపారని తీవ్ర మనస్థాపానికి గురైన రాజు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునన్నాడు. భార్య జ్యోతి ఫిర్యాదుతో పోలీసులు నౌషీన్, ఆమె కుటు ంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుసుకున్న కాలనీ వాసులు నౌషీన్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా నౌషీన్, మరో కుటుంబానికి చెందిన వారు ఇలా సున్నిత మనస్కులను టార్గెట్ చేసి, బ్లాక్ మెయిలింగ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.