Hyderabad | వెంగళరావునగర్, ఆగస్టు 9 : పదిహేను రోజులు గడిచినా ఉమా మహేష్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకే గూడలోని బాలాజీ అపార్ట్మెంట్స్లో నివాసం ఉండే కొల్లూరు ఉమా మహేష్(42) జాడ కోసం అతని కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు వెతికినా లభ్యం కాలేదు. చిన్ననాటి నుంచి మానసిక సమస్యతో ఇబ్బందులు పడే ఉమా మహేష్ గతంలోనూ ఇంటి నుంచి వెళ్లి తిరిగొచ్చిన సందర్బాలు ఉన్నాయి. గత నెల 25వ తేదీన ఇంటి నుంచి ఉమా మహేష్ వెళ్లిపోయాడని అతడి సోదరైన వైద్యురాలు వాసంతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదృశ్యమైన ఉమా మహేష్ ఆచూకీ తెలిసిన వారు ఎస్ఆర్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 8712661069 కు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.