బేగంపేట్, జూన్ 16: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆషాఢమాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2న నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మహంకాళి దేవాలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, సిబ్బంది మంగళవారం ఉదయం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మారేడ్పల్లిని క్యాంపు కార్యాలయంలో కలిసి పండుగ వివరాలను తెలియజేస్తూ లేఖను అందజేశారు.
జూలై 19న ఘటాల ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 2న అమ్మవారికి బోనాల సమర్పణ, 3న రంగం (భవిష్యవాణి) ఉంటాయని ఈవో వివరించారు. బీఆర్ఎస్ రాంగోపాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.