సిటీబ్యూరో, మార్చి 26(నమస్తే తెలంగాణ): అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించనున్నారు. 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే మెట్రో ఫెస్ట్-ఉగాది వేడుకల్లో భాగంగా మెట్రో ప్రయాణికులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు జరుగుతాయని ఎల్ అండ్ టీ వర్గాలు వెల్లడించాయి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా, సామాజిక అనుసంధాన వేదికగా మెట్రో ఫెస్ట్‌లో కార్యక్రమాలు ఉంటాయన్నారు.