కాచిగూడ : భారతీయ సంప్రదాయాల్లో భారతీయులకు తొలి పండుగ ఉగాది (Ugadi ) పండుగ అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. బ్లీస్ బర్గ్ ఫ్యూచర్ (Blissberg Future ) సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు నీలం సుఖేందర్ అధ్యక్షతన శనివారం ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలకు ఉగాది పురస్కారాలను అందజేశారు.
ముఖ్యఅతిథిగా కుమారస్వామి హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా భారతీయులు వైభవంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది అని, ఈ ఉగాది పండుగ షడ్రుచులు అయినా తీపి, కారం, ఉప్పు, పులుపు,వగరు, చేదుల కలయికతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ వాసు, ఆర్కే జైన్, డాక్టర్ హరికుమార్, డాక్టర్ వినయ్ కుమార్ కు ఉగాది పురస్కారాలు (Ugadi Awards ) ఆయన అందజేశారు.